షార్ట్ డ్రెస్‌లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శివాత్మిక రాజశేఖర్
TV9 Telugu
12 JULY 2024
తెలుగు హీరోయిన్, స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ కెరీర్ ప్రారంభంలోనే నటిగా నిరూపించుకుంటుంది. అంతా గ్లామర్ షోతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు.
హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక నటించింది నాలుగు సినిమాలే. కానీ నటనతో అందరి చూపు తనవైపు తిప్పుకుంటుందీ భామ.
ఇక శివాత్మిక.. నాలుగేళ్ల క్రితం `దొరసాని` చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆనంద్ దేవరకొండతో కలిసి నటించి మెప్పించింది.
ఆ తర్వాత తమిళంలో రెండు సినిమాలు చేసింది శివాత్మిక, తెలుగులోనూ రెండు సినిమాలు చేసింది. `పంచతంత్రం`లో కాసేపు మెరిసింది. ఇక `రంగమార్తాండ`లో రాఘవరావు కూతురుగా మెప్పించింది.
సోషల్ మీడియాలో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. వెండితెరపై నటనతో, సోషల్ మీడియాలో అందాలతో అలరిస్తుంది. రెండు రకాల ట్రీట్‌లిస్తూ అలరిస్తుంది.
నేచురల్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న ఈ భామ నేచురల్ యాక్టింగ్ పరంగానూ గుర్తింపు తెచ్చుకుంటుంది. అందంతో అలరిస్తుంది.
హీరోయిన్‌గా సరైన అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియా లో వరుస ఫోటో షూట్స్ చేస్తూ బిజీగా ఉంది.. ఈ ఫోటోస్ కు నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.