ఈ వయ్యారి సొగసును చూసి ఆ అందమే తడబడుతుంది..

TV9 Telugu

29 May 2024

22 ఏప్రిల్ 2000న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నటుడు రాజశేఖర్, నటి జీవిత దంపతులకు జన్మించింది శివాత్మిక రాజశేఖర్.

హైదరాబాద్ లోని తన ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లో నటించడం ప్రారంభించింది ఈ వయ్యారి భామ.

2019లో ఆనంద్ దేవరకొండకి జోడిగా దొరసాని సినిమాతో కథానాయకిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ.

దొరసాని చిత్రంలో నటనకు సైమా వేడుకల్లో బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు కైవసం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ చిత్రానికి బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా సాక్షి ఎక్సలెన్స్ అవార్డు, సంతోషం ఫిల్మ్ అవార్డ్ అందుకుంది ఈ భామ.

2021లో ఆనందం విలయదుం వీడు అనే తమిళ చిత్రంలో గౌతమ్ కార్తీక్ సరసన కథానాయకిగా కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది.

2022లో నితమ్ ఒరు వానం అనే మరో తమిళ చిత్రంలో అశోక్ సెల్వన్ పక్కన కథానాయకిగా నటించింది ఈ ముద్దుగుమ్మ.

2022లో పంచతంత్రం, 2023లో రంగమార్తాండ అనే రెండు తెలుగు చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది ఈ వయ్యారి.