చీరకట్టులో చక్కనమ్మ.. శివాని లేటెస్ట్ పిక్స్ వైరల్

Phani.ch

29 May 2024

శివాని రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జీవిత రాజశేఖర్ దంపతుల పెద్ద కుమార్తె ఈ ముద్దుగుమ్మ.

శివాని రాజశేఖర్ ఒకరు. చాలా రోజుల క్రితమే హీరోయిన్‌గా వచ్చిన ఈ భామ.. ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోకున్నా.. ఆఫర్లు మాత్రం దక్కించుకుంటోంది.

మొదట అడివి శేష్ హీరోగా మొదలైన '2 స్టేట్స్' ద్వారా హీరోయిన్‌గా రావాల్సింది. కానీ, ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఆగిపోయింది.

ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 'పెళ్లి సందD' మూవీలో చిన్న పాత్రలో శివాని పరిచయం అయింది. 'అద్భుతం' అనే సినిమా ద్వారా శివాని రాజశేఖర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

 దీని తర్వాత WWW అనే సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. శివాని రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఆఫర్లను అందుకుంటూ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. 

 అలాగే, 'అన్బరివు', 'నింజాక్ నీతి' అనే తమిళ సినిమాలు కూడా చేసింది. వీటిలో అద్భుతమైన నటనతో అలరించింది. తద్వారా తమిళంలో కూడా పేరు తెచ్చుకుంది.

శివాని రాజశేఖర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని స్టన్నింగ్ లుక్స్ షేర్ చేయగా నెట్టింట క్రేజీ కామెంట్స్ తో వైరల్ అవుతున్నాయి.