17 November 2023

కిల్లింగ్ లుక్స్‌తో కవ్విస్తున్న శివాని రాజశేఖర్

టాలీవుడ్‌లో కొందరు  సినీ వారసులు సందడి చేస్తున్నారు అందులో  శివాని రాజశేఖర్ ఒకరు.

అడివి శేష్ హీరోగా నటించిన  2 స్టేట్స్' ద్వారా తెలుగు తెరకు పరిచయంకావాల్సిన ఈ  ముద్దుగుమ్మ  ఉండగా షూటింగ్ పూర్తైన తర్వాత ఆగిపోయింది ఈ సినిమా.

చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత 'పెళ్లి సందD' సినిమాలో  ఓ చిన్న పాత్రలో  శివాని తెలుగు తెరకు పరిచయమైంది.

తర్వాత 'అద్భుతం' అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ  ఇచ్చి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది.

ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస ఆఫర్స్, వరుస సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది.

కేవలం తెలుగు లోనే కాకుండా 'అన్బరివు', 'నింజాక్ నీతి' వంటి తమిళ సినిమాలు కూడా చేసింది.

తాజాగా  'కోటబొమ్మాలి పీఎస్' అనే సినిమాలో నటించగా ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.