చీరలో చంద్రుని ప్రేయసిలా మురిసిపోతున్న శివాని..

TV9 Telugu

23 April 2024

1 జూలై 1996న సీనియర్ హీరో రాజశేఖర్, నటి జీవిత దంపతులకు చెన్నైలో జన్మించింది అందాల భామ శివాని రాజశేఖర్.

2021లో రోషన్ మేక, శ్రీలీల జోడిగా తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాలో ఓ చిన్న పాత్రతో సినీ అరంగేట్రం చేసింది ఈ భామ.

అదే ఏడాది రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ తెలుగు చిత్రం అద్భుతంలో యంగ్ హీరో తేజ సజ్జకి జోడిగా కథానాయకిగా పరిచయం అయింది.

తర్వాత WWW అనే ఓ ఆన్లైన్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించి ఆకట్టుకుంది ఈ అందాల భామ.

2022లో అన్బరివు అనే ఓ తమిళ చిత్రంతో కోలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు కథానాయకిగా పరిచయం అయింది ఈ వయ్యారి భామ.

అదే ఏడాది ఉదయనిధి హీరోగా నటించిన నెంజుకు నీది అనే ఓ తమిళ పొలిటికల్ డ్రామా చిత్రంలో మెప్పించింది ఈ బ్యూటీ.

2022లో రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో వచ్చిన శేఖర్ అనే చిత్రంలో కూతురి పాత్రలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ.

2023లో విడుదలైన శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కోటబొమ్మాళి పిఎస్ చిత్రంలో కనిపించి హిట్ అందుకుంది ఈ వయ్యారి.