TV9 Telugu
శివకార్తికేయన్ మూవీ టైటిల్ ఫిక్స్.. గుంటూరు కారం పాటకి భారీ వ్యూస్..
20 Febraury 2024
కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా సీనియర్ హీరో కమల్ హాసన్ నిర్మాతగా ఓ సినిమా వస్తుంది.
రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అమరన్ అనే టైటిల్ ఖరారు చేసారు. తాజాగా టైటిల్ గ్లింప్స్ విడుదలైంది.
కశ్మీర్, టెర్రరిస్ట్, ఇండియన్ ఆర్మీ కథాంశం నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. ఈ గ్లింప్స్ ఆద్యంతం దేశభక్తితో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లతో ఉంది.
మల్లి అంకం తెరకెక్కిస్తున్న అల్లరి నరేష్ 61వ సినిమాకు ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే టైటిల్ ఖరారు చేసారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది.
అప్పట్లో ఇవివి సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్ కాంబోలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు అనే క్లాసిక్ టైటిల్‌నే ఈ సినిమా కోసం వాడుకుంటున్నారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం సంక్రాంతి పండక్కి విడుదలై విజయం సాధించింది.
ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో కుర్చీ మడతబెట్టి పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.
ఈ వీడియో సాంగ్‌కు అప్పుడే 50 మిలియన్ వ్యూస్ వచ్చాయి.. ఇక లిరికల్ సాంగ్ తాజాగా 100 మిలియన్ వ్యూస్ అందుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి