అందం ఈమెకు అప్పు ఉందేమో వయసు పెరిగినా కూడా తగ్గనంటుంది..
28 November 2023
11 సెప్టెంబర్ 1982న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్ లో జన్మించింది అందాల భామ శ్రియా సరన్.
ఈమె తండ్రి పుష్పేంద్ర శరణ్ భట్నాగర్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో పనిచేశారు. తల్లి నీరజా శరణ్ భట్నాగర్ కెమిస్ట్రీ టీచర్.
హరిద్వార్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, న్యూఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్య పూర్తి చేసింది.
తర్వాత ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదువుకుంది. సాహిత్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని అందుకుంది.
చిన్నతనంలోనే కథక్, రాజస్థానీ జానపద నృత్యంలో తన తల్లి నీరజా శరణ్ భట్నాగర్ వద్ద శిక్షణ పొందింది ఈ వయ్యారి భామ.
కళాశాలలో అనేక తన ఉపాధ్యాయునితో కలిసి నృత్య బృందాలతో పాలుపంచుకుంది. వారు తమ సామాజిక సమస్యలను నృత్యంగా చూపించేవారు.
2001లో ఇష్టం అనే తెలుగు చిత్రంతో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది. తర్వాత నాగార్జున సంతోషం చిత్రంలో చేసింది.
తర్వాత చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే, ఠాగూర్, ఎలా చెప్పను, నేనున్నాను, ఛత్రపతి వంటి ఏంటో హిట్ చిత్రాల్లో మెప్పించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి