ఏంటి బేబీ సినిమా కాపీ కొట్టారా..? ఇదిగో ప్రూఫ్..
Anil Kumar
27May 2024
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన బేబీ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
చిన్న సినిమాగా వచ్చిన బేబీ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు మంచి కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది.
అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. యూత్‌ని ఎంతగానో ఆకట్టుకుంది. చాలామంది ఈ మూవీ ఫెవరెట్ అంటున్నారు.
ఇంతవరకు బానే ఉంది.. తాజాగా బేబీ సినిమా బృందంపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.. అది ఏంటో తెలుసుకుందాం..
సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా కాపీ అంటూ సంచలనం సృష్టిస్తున్నారు దర్శకుడు శిరిన్ శ్రీరామ్.
ఈ కథ తమిళనాడులో జరిగిందని, అది తన కంట పడిందని.. అలా బేబీ కథ రాసుకున్నానంటూ అప్పట్లో చెప్పారు సాయి రాజేష్.
కానీ ప్రేమించొద్దు అనే సినిమా తెరకెక్కిస్తున్న దర్శకుడు శిరిన్ శ్రీరామ్ మాత్రం ఈ కథ తనదేనంటూ ఆరోపిస్తున్నారు.
తనకు డైరెక్టర్ సాయి రాజేష్ అన్యాయం చేసారంటూ.. బేబీ మూవీ లీక్స్ అంటూ ఏకంగా ఓ బుక్ రిలీజ్ చేశారు శిరిన్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి