12 October 2025
50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. శిల్పా శెట్టి డైట్ సీక్రెట్..
Rajitha Chanti
Pic credit - Instagram
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. స్టార్ హీరోస్ అందరితో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
ఇప్పుడు 50 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తూ కుర్ర హీరోయిన్లకు గట్టిపోటినిస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు డైట్ సీక్రెట్ తెలుసా..
శిల్పా శెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రోజూ ఉదయాన్నే ఒకటిన్నర గ్లాసు గోరువెచ్చని నీటితో తన రోజును ప్రారంభిస్తానని తెలిపింది.
నాలుగు చుక్కల నోని రసం తీసుకుంటుందట. అలాగే రోజు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో నోటిని పుక్కిలిస్తానని.. ఇది ఆయుర్వేద పద్దతి అని తెలిపింది.
ఉదయాన్నే కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ గా తాజా పండ్లు తీసుకుంటుంది. వీటి నుంచి ఫైబర్ లభిస్తుంది. అలాగే ఆపిల్ ముక్కలు బాదం పాలతో కలిపి తీసుకుంటుంది.
కొబ్బరి పాలు ఆరోగ్యానికి ఎంతో అవసరమని.. భోజనంలో కచ్చితంగా నెయ్యి తీసుకుంటుందట. అరటిపండ్లు, అధిక కార్బ్ పండ్లు తీసుకుంటుందట.
బ్రౌన్ రౌస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. బరువును నియంత్రించేందుకు రోజూ యోగా, వ్యాయమాలు, వాకింగ్, సైక్లింగ్ చేస్తుంటానని చెప్పుకొచ్చింది.
సాయంత్రం 7.30 గంటలలోపు డిన్నర్ పూర్తి చేస్తాను. కార్బ్ తక్కువ ఉండే పదార్థాలను మాత్రమే తీసుకుంటానని.. ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటానని తెలిపింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్