Rajeev
హీరోయిన్ గా పనికి రావు అన్నారు.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ గా ..
18 April 2024
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు రావడం అంత సులభం కాదు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం అంతకన్నా కష్టం.
శిల్ప శెట్టి స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో రాణిస్తుంది. అయితే కెరీర్ ఆరంభంలో ఈ చిన్నది చాలా అవమానాలు ఎదుర్కొన్నదట.
నిర్మాతలు చాలా మంది ఈ చిన్నదాన్ని రిజక్ట్ చేశారట. తన కెరీర్ ప్రారంభ దశలో చాలా నిరాశ, నిరుత్సాహానికి గురైంది
అయినా కూడా ధైర్యాన్ని కోల్పోకుండా.. హీరోయిన్ గా అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ హోదాను అందుకుంది. సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించింది.
నేను నల్లగా, సన్నగా, పొడవుగా ఉండేదాన్ని. గ్రాడ్యుయేషన్ అయ్యాక మా నాన్నతో కలిసి ఏదైనా చెయ్యాలనుకున్నా..
జస్ట్ ఫన్ కోసం ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్నప్పుడు అనుకోకుండా అవకాశాలు వచ్చాయి. ఓ ఫోటోగ్రాఫర్ నా ఫోటో షూట్ చేశారు.
కానీ నా కెరీర్ అంత సులభంగా సాగలేదు. ఎలాంటి కారణం లేకుండా నన్ను తమ సినిమాల నుంచి తప్పించే నిర్మాతలు కూడా ఉన్నారని నాకు గుర్తుంది అని చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి