శర్వా ఛాలెంజెస్‌ ఫేస్‌ చేస్తారా?

TV9 Telugu

08 March 2024

హీరో శర్వానంద్‌ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోంది? అడ్రినలైన్‌ పంపింగ్‌ అడ్వంచరస్‌గా సాగుతుందన్నది ఆన్సర్‌.

ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ హీరోగా శర్వా36 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కనుంది.

ఈ అడ్వంచరస్‌ సినిమాలో రకరకాల చాలెంజెస్‌ని ఫేస్‌ చేసి సక్సెస్‌ అవుతారట టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌.

సవాళ్లను స్వీకరించి, విజయంతో ముందుకు సాగమని హీరో శర్వాని విష్‌ చేసింది యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ.

ఇటీవల పుట్టినరోజు సందర్భంగా ట్రెండ్‌ అవుతున్న శర్వాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతోంది.

యాక్చువల్‌గా విజయ్ దేవరకొండ హీరో నటించిన అర్జున్‌రెడ్డి కథను సందీప్‌ రెడ్డి వంగా శర్వానంద్‌కి చెప్పారు.

అయితే, తనకు సూట్‌ కాదని స్టార్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగకి నో చెప్పారట టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌.

ఈ కథ విషయంలోనే కాదు, ప్రతి సందర్భంలోనూ కథల పరంగా ఆచితూచి అడుగులు వేస్తారు శర్వానంద్‌ అన్నది ఆయన సన్నిహితులు చెబుతున్న మాట.