ఇండస్ట్రీ హిట్ సినిమాను వదులుకున్న శర్వా 

TV9 Telugu

09 March 2024

మాస్ యాక్షన్.. రొమాంటిక్ మూవీస్ కాకుండా కుటుంబసమేతంగా చూడగలిగే సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్.

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా ఎంతోమంది తెలుగు ఫ్యామిలీ అడియన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

అయితే చాలా కాలంగా శర్వా నుంచి మరో ప్రాజెక్ట్ రాలేదు. ఆలోటును తీరుస్తూ.. ఈ హీరో బర్త్‌ డే రోజు ఒకేసారి వరుసగా 3 సినిమాల అప్డేట్స్ వచ్చాయి. 

అయితే కొంత మంది ఫ్యాన్స్ మాత్రం.. శర్వానంద్ ఓ సినిమాను మిస్‌ చేయడాన్నే తలుచుకుని తెగ ఫీలవుతున్నారు. 

ఇన్నాళ్ల తన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలను వదులుకున్నారు శర్వా అందులో అర్జున్ రెడ్డి సినిమా ఉండడం బాధ బాధ పెడుతున్న విషయం 

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ మాత్రం శర్వానంద్. ఇదే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శర్వా.

 సందీప్ రెడ్డి వంగా ముందుగా శర్వాకే చెప్పారట. కథ నచ్చినా.. అందులోని కొన్ని అంశాలు తనకు సెట్ కాదని వదులుకున్న అని అప్పట్లో శర్వే చెప్పారు.

అయితే ఆ హిట్ సినిమా మిస్సైనందుకు బాధలేదని.. ఎవరికి రాసిపెట్టి ఉన్న కథలు వారికే దక్కుతాయని ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.