ఓటీటీలో జవాన్.. దిమ్మతిరిగే అప్డేట్..

08 October 2023

జవాన్‌.. రీసెంట్‌గా రిలీజ్ అయి షారుఖ్ కెరీర్‌లోనే నెంబర్ 1 సినిమాగా హిస్టరీ కెక్కింది. బాక్సాఫీస్‌ బద్దలు కొట్టింది.

కలెక్ష్స్‌లో నయా రికార్డులను క్రియేట్ చేసింది జవాన్ మూవీ. షారుఖ్‌ మేనియాను మరోసారి విశ్వవాప్యం చేసింది.

అలాంటి ఈ సినిమా.. ఓటీటీలోకి వస్తోందంటే ఎలా ఉంటుంది. అదే ప్రైమ్ న్యూస్‌గా... సోషల్ మీడియాను షేక్ చేసే న్యూస్గా మారుతుంది కదా..! సరిగ్గా.. ఇదే ఇదే జరిగింది ఇప్పుడు.

ఎస్ ! అట్లీ డైరెక్షన్లో .. షారుఖ్ హీరోగా యాక్ట్ చేసిన ఫిల్మ్ జవాన్. పఠాన్ సూపర్ డూపర్ హిట్ తర్వాత.. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది ఈ సినిమా.

పఠాన్‌కు మించి రికార్డ్స్‌ను క్రియేట్ చేసింది. రిలీజ్ అయి ఇప్పటికే చాలా రోజులవుతున్న ఏదో చోట థియేటర్లో రన్ అవుతూనే ఉంది.

ఇక ఈ క్రమంలోనే అట్లీ, షారుఖ్ ఖాన్ జవాన్‌ సినిమా ఓటీటీ విడుదల డేట్ పై దిమ్మతిరిగే అప్డేట్ బయటికి వచ్చింది.

షారుఖ్‌  ఖాన్ బర్త్‌ డే సందర్భంగా.. నవంబర్ 2న జవాన్ మూవీ నెట్‌ ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

అయితే ఈ న్యూస్ అఫీషియల్గా అనౌన్స్ మెంట్ రానప్పటికీ.. బాలీవుడ్ మీడియా ఇదే కోడై కూస్తోంది. నెట్టింట కూడా.. ఇదే న్యూస్ తెగ వైరల్ అవుతోంది.