TV9 Telugu

షరతులతో ట్రైలర్‌!  సీఎంగా విజయ్‌!

05 March 2024

చైతన్యరావు మాదాడి, భూమి శెట్టి జంటగా నటించిన సోషల్ సెటైరికల్ ఫ్యామిలీ డ్రామా సినిమా షరతులు వర్తిస్తాయి.

తాజా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ విడుదల చేసారు మూవీ మేకర్స్. ఈ ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకొనేలా ఆసక్తికరంగా సాగింది.

మంచి కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించామని, ట్రైలర్‌ నచ్చితే మిగిలిన వారికి షేర్‌ చేయమని కోరారు చైతన్యరావు.

మార్చి 15న థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమా. ఇప్పటికి 60 థియేటర్లు కన్‌ఫర్మ్ అయ్యాయని చెప్పారు మేకర్స్.

విజయ్ దళపతి ఆఖరి సినిమాపై కోలీవుడ్‌లో మాత్రమే కాదు సౌత్ ఇండస్ట్రీ అంతటా ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ వినిపిస్తోంది.

విజయ్ చివరిగా నటించబోయే సినిమాలో సీఎం పాత్రలో కనిపిస్తారనే టాక్‌ సోషల్ మీడియా వేదికగా స్ప్రెడ్‌ అవుతోంది.

ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తారని, సమంత హీరోయిన్‌గా నటిస్తారనీ సౌత్ సినిమా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

సన్‌ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా ఉంటుందన్న మాట కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో తెగ వినిపిస్తోంది.