16 October 2023
శంకర్ దాదా మళ్లీ వచ్చేస్తున్నాడు..
మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ సినిమాను రీరిలీజ్ చేస్తారంటూ ఆగస్టు నెల నుంచే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో..
నవంబర్ 4న శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాను థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నట్లు బీఏ రాజు టీమ్ అధికారికంగా ప్రకటించింది.
హిందీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ గా వచ్చిన సినిమాను తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ గా తెరకెక్కించారు.
మెగస్టార్ చిరంజీవి ఈ సినిమాలో చూపించిన కామెడీ టైమింగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు.
బాస్ కు ముఖ్య అనుచరుడిగా, ఏటీఎం పాత్రలో శ్రీకాంత్ ఒదిగిపోయారు. దీంతో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.
తాజాగా ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఇక మెగాఫ్యాన్స్‌కి పండగే పండగ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి