04 December 2023

పింక్ శారీ లో పిచ్చెక్కిస్తున్న పూర్ణ

పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంచందాలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తూనే ఉన్నారు. 

పూర్ణ  అసలు పేరు షామ్నా కాసిం. పూర్ణ స్క్రీన్ నేమ్ గా చేసుకుంది. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

మలయాళీ అందం పూర్ణ అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’లో నటించి మంచి పాపులర్ అయ్యారు. 

ఇక ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైయారు.

పూర్ణకు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు. అందులో భాగంగా ’సిల్లీ ఫెలోస్’ ‘అఖండ’ ‘దృశ్యం 2’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.

 ఇక పూర్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క స్మాల్ స్క్రీన్‌పై కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. 

గత ఏడాది వివాహం చేసుకున్న పూర్ణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె దుబాయ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవించారు. 

భర్త అనుమతితో వివాహం అనంతరం కూడా పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు. బుల్లితెరపై, సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నారు.