షూటింగ్‌లో హీరో షారుక్‌కి తీవ్ర గాయాలు

దాదాపు ఐదేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చిన షారుక్ ఖాన్.. 'పఠాన్'తో బ్లాక్‌బ్లస్టర్ హిట్ కొట్టారు.

 ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డంకీ' మూవీ చేస్తున్నారు.

తమిళ డైరెక్టర్ అట్లీతో చేసిన 'జవాన్' విడుదలకు రెడీగా ఉంది.

ఇది సెప్టెంబరు 7న పాన్ ఇండియా లెవల్లో థియేటర్లలోకి రాబోతుంది.

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి ప్రమాదం జరిగింది.

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ సీన్ సందర్భంగా గాయమైంది.

దీంతో హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు పెద్దగా ప్రమాదం లేదని చెప్పినప్పటికీ.. మైనర్ సర్జరీ అవసరమని సూచించారట.

 ప్రస్తుతం షారుక్.. స్వదేశానికి వచ్చేశారని, రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.