25 September 2023
100 ఏళ్ళ ఇండియన్ సినిమా హిస్టరీలో మరే హీరోకు సాధ్యం కాని ఓ ఫీట్ అందుకోబోతున్నారు కింగ్ ఖాన్. అది చూసి కాలర్ ఎగరేస్తున్నారు బాద్షా ఫ్యాన్స్. ఇంతకీ ఏంటా రికార్డ్..?
ప్రభాస్, యశ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రమే ఒక్కోసారి 1000 కోట్ల సినిమాలిచ్చారు. షారుక్ రెండోసారి ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాదు కేవలం హిందీలో మాత్రమే పఠాన్, జవాన్ కలిసి 1000 కోట్లు నెట్ వసూలు చేసాయి.
డంకీ సైతం 1000 కోట్లు వసూలు చేస్తుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్. రాజ్ కుమార్ హిరాణీ ట్రాక్ రికార్డ్‌కు షారుక్ ఉన్న ఫామ్ తోడైతే 1000 కోట్లు అసలు మ్యాటరే కాదు.
డిసెంబర్ 22న విడుదల కానున్న డంకీ నుంచి అనౌన్స్‌మెంట్ వీడియో తప్ప మరోటి విడుదల కాలేదు. ఇది కూడా 1000 కోట్లు కొడితే.. ఒకే ఇయర్‌లో హ్యాట్రిక్ 1000 కోట్లు ఇచ్చిన హీరోగా చరిత్రలో నిలిచిపోతారు షారుక్.