బాలీవుడ్ బాద్ షా.. కింగ్ ఖాన్ షారుఖ్ తిరమలకు వచ్చారు. తన మోస్ట్ అవేటెడ్ మూవీ జవాన్ హిట్ కావాలని రికార్డులు బద్దలు కొట్టాలని ఆ దేవాది దేవుణ్ని కోరుకున్నారు.
బాద్ షా తిరమల దర్శనం ఫుటేజ్‌తో.. త్రూ అవుట్ ఇండియన్ సోషల్ మీడయా వేదికగా కూడా వైరల్ అయింది ఈ వీడియో.
కానీ ఈ తరువాత అదే వీడియోలో రికార్డ్ అయిన ఓ ఫన్నీ మూమెంట్‌తో.. ఇప్పుడు ఫన్నీ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటున్నారు.
అయితే అదేంటని అనుకుంటున్నారా? తిరుమలలో కింగ్ ఖాన్ శ్రీవారి సాక్షిగా లగెత్తడం జరిగింది. ఎందుకనుకుంటున్నారా..
శ్రీవారి సమక్షంలో షారుఖ్ కనిపించడంతో.. ఆయన్ను చూసేందుకు.. తాకేందుకు.. సెల్ఫీ దిగేందుకు చాలా మంది పోటీపడ్డారు.
ఇక ఈ క్రమంలో వాళ్ల ను తట్టుకోలేక షారుఖ్ పరుగులు పెట్టారు. లగెత్తుకుంటూ ఫ్యాన్స్‌కు దూరంగా.. శ్రీవారి మాడవీధుల నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు.
అయితే ఇప్పుడీ ఈ క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగోళ్ల దెబ్బకి.. లగెత్తిన షారుఖ్ అనే కామెంట్ వచ్చేలా చేస్తోంది.
ఇదిలాఉంటే షారుఖ్ నటించించిన జవాన్ చిత్రం ఈరోజు (సెప్టెంబర్ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.