TV9 Telugu

07 February 2024

ఎట్టకేలకు ఓటీటీ లోకి వస్తున్న డుంకీ.?

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ గత ఏడాది మూడు సినిమాలతో సక్సెస్ అందుకొని హ్యాట్రిక్ కొట్టారు. 

ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 21న ‘డుంకీ’ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది.

‘జవాన్’, ‘పఠాన్’ చిత్రాలతో పోలిస్తే ‘డంకీ’ని థియేటర్లలో చూసిన వారి సంఖ్య తక్కువే.

ఈ సినిమాను ఓటీటీలో చూస్తే చాలు అనుకునే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

అయితే దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఫిబ్ర‌వ‌రి 16న ‘డ‌ంకీ’ సినిమా ఓటీటీకి వ‌స్తుంద‌ని అంటున్నారు.

‘జియో సినిమా’ ద్వారా ఈ సినిమా అందుబాటులోకి రానుందని టాక్ వినిపిస్తుంది.

దీనిపై చిత్రబృందం లేదా ఓటీటీ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.