సందీప్‌ డైరక్షన్‌లో మరో బాలీవుడ్ హీరో.? ధనుష్‌, శేఖర్‌ కమ్ముల మూవీ టైటిల్ ఫిక్స్.?

TV9 Telugu

04 February  2024

సందీప్‌ రెడ్డి వంగా డైరక్షన్‌లో అర్జున్‌రెడ్డి హిట్‌ అయినప్పుడు దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి ఎలా మాట్లాడుకున్నారు.

ఇటీవల యానిమల్‌ హిట్‌ అయినప్పుడు కూడా అలాగే మాట్లాడుకున్నారు. త్వరలోనే డార్లింగ్‌ ప్రభాస్‌తో స్పిరిట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు సందీప్‌ రెడ్డి.

నెక్స్ట్ షారుఖ్‌తోనూ, రణ్‌వీర్‌సింగ్‌తోనూ పనిచేయాలని ఉందని ఓపెన్‌గా చెప్పేశారు. ఆల్రెడీ షారుఖ్‌ని ఈ కెప్టెన్‌ రెండు సార్లు కలిశారట.

స్పిరిట్‌ కంప్లీట్‌ అయ్యాక, షారుఖ్‌ - సందీప్‌ కాంబోని ఎక్స్ పెక్ట్ చేయొచ్చని అంటున్నారు నార్త్ క్రిటిక్స్.

లాస్ట్ ఇయర్‌ సర్‌ సినిమాతో తెలుగులో పెద్ద హిట్‌ అందుకున్నారు హీరో ధనుష్‌. ఈ ఏడాది శేఖర్‌ కమ్ముల డైరక్షన్‌లో ఆల్రెడీ చేస్తున్నారు.

రీసెంట్‌గా తమిళ్‌లో కెప్టెన్‌ మిల్లర్‌ మంచి మార్కులే కొట్టేసింది. ఈ వేసవికి డీ 50ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు ధనుష్‌.

ఈ సినిమాకు రాయన్‌ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. డీ50లో కార్తవరాయన్‌ అనే కేరక్టర్‌ చేస్తున్నారు ధనుష్‌.

ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది ఈ సినిమా. హీరోగా నటిస్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ధనుష్.