19 September 2023

ఎస్.ఆర్.కె కి అర్ధం తెలిస్తే షాక్ అవ్వాల్సింద

Pic credit - Instagram

మన ఇండియాలో టాప్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అమితాబ్ తర్వాత  షారుఖ్ ఉంటారన్న విషయం తెలిసిందే. 

బాలీవుడ్ లో లవ్ స్టోరీ మూవీస్ అంటే షారుఖ్ ఖాన్ మాత్రమే గుర్తుకు వచ్చేవాడు అప్పట్లో ఆయన డామినేషన్ అలా ఉండేది.

ఎన్నో కల్ట్ క్లాసిక్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు షారుఖ్. ఎన్నో వరుస బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టాడు.

అయితే దశాబ్దం కాలంగా షారుఖ్ ఖాన్ వరుస ఫ్లాప్స్ తో  గడ్డు కాలం ఎదుర్కున్నాడు అనే చెప్పాలి.

తోటి స్టార్ హీరోలు హిట్స్  తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంటే, షారుఖ్ ఖాన్ మాత్రం వరుస ఫ్లాప్స్ తో రేస్ లో వెనుకబడ్డాడు. 

ఈ ఏడాది మొదట్లో ‘పఠాన్’ చిత్రం తో వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టగా రీసెంట్ గా ‘జవాన్’ సినిమాతో మరో వెయ్యి కోట్ల గ్రాస్ కి చేరువలో ఉన్నాడు.

ఇదంతా పక్కన పెడితే షారుఖ్ ఖాన్ షార్ట్ కట్ లో అందరూ ఎస్.ఆర్.కె అని పిలుస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.

ఎస్.ఆర్.కె కి లో ఎస్ అంటే శేఖర్ అని, ఆర్ అంటే రాధ అని , అలాగే కె అంటే కృష్ణ అని, మొత్తం మీద తన పేరు ని శేఖర్ రాధ కృష్ణ అని ఓ  ఇంటర్వ్యూ లో తెలిపాడు.

షారుఖ్ ఖాన్ అన్నీ మతాలను సమానంగా ఆదరిస్తాడు అని చెప్పకనే చెప్పాడు. రీసెంట్ గానే అయన తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్న సంగతి అందరికీ తెలిసిందే.