20 September 2023

900కోట్ల క్లబ్‌లో షారుఖ్.. రికార్డ్‌ బద్దలుకొట్టే దిశగా జవాన్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారఖ్ ఖాన్.. తన జవాన్‌ మూవీతో రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నారు.

ఎప్పటి నుంచో ఎయిమ్ చేస్తున్న 1000 కోట్ల రికార్డును.. ఎట్టకేలకు రీచ్ అయ్యే దిశగా పరుగులు పెడుతున్నారు.

పఠాన్‌తో ఆ ఫీట్ సాధించాలని అనుకున్నా.. అది కుదరకపోవడంతో.. జవాన్‌తో ఆ రికార్డ్‌ బద్దలు కొట్టారకున్నారు.

అయితే అలా అనుకున్నట్టే.. తాజాగా 1000కోట్ల మార్క్‌ వైపు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు షారుఖ్.

ఆ పరుగులోనే.. జవాన్‌ సినిమాతో.. ఎట్ ప్రజెంట్ వరల్డ్ వైడ్  907.54 కోట్లు వసూలు చేశారు షారుఖ్‌.

ఇక ఈ 907.54 క్రోర్ గ్రాస్‌ను.. జస్ట్ 13 రోజుల్లోనే.. కలెక్ట్ చేసేసింది.. షారుఖ్ జవాన్‌ మూవీ.

ఇక ఈ వీకెండ్‌తో.. జవాన్ మూవీ.. 1000 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం లాంచనమే అనే టాక్ కూడా త్రూ అవుట్ బాలీవుడ్ రీసౌండ్ అవుతోంది.

ఇక ఈ ఫీట్ సాధిస్తుండటంతో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెగ ఖుషి అవుతున్నారు.