25 October 2023

రెండోసారి వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షారూఖ్‌ ఖాన్‌.

ఆ సినిమా విషయంలో వర్కవుట్‌ అయిన సక్సెస్‌ ఫార్ములాను మళ్లీ రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు.

పఠాన్‌, జవాన్ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న షారూఖ్ ఖాన్‌ నెక్ట్స్ డంకీతో ఆడియన్స్‌ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

మాస్టర్ మేకర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

వరుసగా పఠాన్‌, జవాన్ సినిమాలతో వెయ్యి కోట్ల వసూళ్ల మార్క్ టచ్ చేసిన కింగ్ ఖాన్‌, డంకీతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.

షారూఖ్ కూడా సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేసేందుకు అన్ని జాగ్రత్త తీసుకుంటున్నారు. ముఖ్యంగా హిట్ సెంటిమెంట్స్‌ను రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు బాద్‌షా.

పఠాన్ వసూళ్ల విషయంలో సౌత్‌ కాంట్రిబ్యూషన్‌ కూడా చాలానే ఉంది. ఫస్ట్ టైమ్‌ పాన్‌ ఇండియా అటెంప్ట్ చేసిన బాద్‌షాకి దక్షిణాదిలో గ్రాండ్‌ వెల్‌ కం దక్కింది.

ఇక జవాన్ సక్సెస్‌లో సౌత్ డైరెక్టర్‌, సౌత్ స్టార్స్‌ కీ రోల్‌ ప్లే చేశారు. నెక్ట్స్ డంకీ సినిమాలోనూ సౌత్‌ ఫ్లేవర్ గట్టిగా కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో ప్రారంభమవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

ఈ న్యూస్ వైరల్ కావటంతో షారూఖ్‌ ఖాతాలో మరో బిగ్ పడటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.