60 ఏళ్ల వయసులో షారుఖ్ డైట్ సీక్రెట్ ఇదే.. అదొక్కటి మానేయడంతోనే ఇలా
Rajitha Chanti
Pic credit - Instagram
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు ఈరోజు (నవంబర్ 2). ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో సినీప్రముఖులు, అభిమానలు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
అలాగే 60 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా కనిపించడానికి గల రీజన్, డైట్, ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. తాజాగా తన డైట్ సీక్రెట్ పంచుకున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ రహస్యాన్ని వెల్లడించారు. ధూమాపానం మానేసినప్పటి నుంచి తన ఆరోగ్యంలో పాజిటివ్ మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు.
రోజూ రెండు పూటలు మాత్రమే భోజనం చేస్తాను, చిరుతిళ్ల జోలికి అస్సలు వెళ్లను. ఆహారంలో మొలకలు, గ్రిల్డ్ చికెన్, బ్రోకోలి, పప్పుతో చేసే కూరలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటా.
భోజనం సింపుల్ గా ఉంటేనే ఇష్టపడతానని అన్నారు. తాను ప్రత్యేకంగా డైట్ పాటించనని.. కేవలం తేలికపాటి ఆహారం, ఆరోగ్యం తినడం మాత్రమే చూసుకుంటానని అన్నారు.
బిర్యానీ , రోటీ, పరాఠా, నెయ్యి లేదా లస్సీ అన్నింటినీ తీసుకుంటానని.. కానీ కచ్చితంగా వ్యాయామం చేస్తానని అన్నారు. అలాగే నిద్రకు చాలా ప్రాధాన్యత ఇస్తానని అన్నారు.
శరీరానికి సరిపడా నిద్ర ఉండేలా చూసుకుంటానని.. కానీ నిద్రపోయే ముందు వ్యాయామం చేస్తానని అన్నారు. అలాగే ప్రతిరోజూ యోగా, వ్యాయమం చేస్తానని అన్నారు షారుఖ్.
ఇటీవలే జవాన్ సినిమాతో హిట్టు అందుకున్న షారుఖ్.. ఇప్పుడు కింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సుహానా ఖాన్, దీపికా పదుకొణే కీలకపాత్రలు పోషిస్తున్నా సంగతి తెలిసిందే.