'డెవిల్' మూవీ కోసం వేసిన సెట్స్ .. వాటి విశేషాలు...

04 September 2023

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'డెవిల్".

బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. స్వాతంత్ర్యానికి ముందు కథాంశంతో రూపొందుతోన్న ఈ పీరియాడిక్ మూవీ కోసం మేకర్స్ భారీ సెట్స్ ను వేశారు.

'డెవిల్' మూవీ కోసం 80 సెట్స్ వేయటం విశేషం. ఈ సినిమాను 1940 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. కాబట్టి దానికి తగ్గట్లు సెట్స్ ను రూపొందించారు.

ఆర్ట్ డైరెక్టర్ గాంధీ ఈ చిత్రానికి సెట్స్ ను రూపొందించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ వంటి పలు ప్రాంతాల నుంచి సెట్స్ ను రూపొందించటానికి కావాల్సిన సామాగ్రిని తెప్పించారు.

1940 మద్రాస్ ప్రాంతంలోని ఆంధ్రా క్లబ్ తో పాటు బ్రిటీష్ కాలానికి తగ్గట్లు 10 వింటేజ్ సైకిల్స్, 1 వింటేజ్ కారు సిద్ధం చేశారు.

బ్రిటీష్ కవర్ డిజైన్ తో ఉన్న 500 పుస్తకాలు, 1940 కాలానికి చెందిన కార్గో షిప్ కూడా ఈ చిత్రం కోసం ఏర్పాటు చేశారు.

ఈ మూవీ కోసం 36 అడుగుల ఎత్తైన లైట్ హౌస్ సెట్ ను వైజాగ్  సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో సిద్ధం చేశారు.

ఈ సెట్స్ వేయటానికి 9 ట్రక్కుల కలపను తెప్పించారు. వెయ్యి టన్నులకు పైగా ఐరన్, ఫైబర్, 10వేల చదరపు అడుగుల వింటేజ్ వాల్ పేపర్ ను ఉపయోగించారు.