TV9 Telugu
నేను ఒళ్లు అమ్ముకోలేదు కానీ అలా చేశాను అంటూ నటి మల్లిక ఆవేదన.
05 April 2024
సినీరంగంలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు.. అవకాశాల వస్తే కష్టపడుతూ ఉంటారు. అదే ఛాన్సులు తగ్గితే దీన స్థితిలోకి పోతారు.
తాజాగా నటి మల్లిక జాగుల తాను పడిన కష్టాలు గురించి తెలిపింది. ఛాన్స్ లకోసం నానా కష్టాలు పడ్డాను అని తెలిపింది.
మల్లిక జాగుల బుల్లి తెరపై చాలా సీరియల్స్ లో విలన్ పాత్రల్లో నటించింది. పలు సినిమాల్లోనూ తన నటనతో మెప్పించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మల్లిక.. తెలుగు వాళ్లకు అవకాశాలు తక్కువ.. ఇతర బాషలనుంచి ఆర్టిస్ట్ లను తీసుకొచ్చుకుంటున్నారు.
చాలా కాలం నాకు అవకాశాలు రాలేదు. అదే టైం లో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో నేను డిప్రషన్ లోకి వెళ్ళాను.
సినీ ఇండస్ట్రీలో కెరీర్ బాగున్నంత వరకు ఓకే.. కానీ తేడా కొడితే మాత్రం కష్టం.నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలిని..
కరోనా తర్వాత చాలా కష్టాలు పడ్డాను, అవకాశాలు లేక చీరలు కూడా అమ్మాను.. నన్ను కొంతమంది కమిట్ మెంట్ అడిగారు..
టార్చర్ పెట్టారు., నేను ఒళ్లు అమ్ముకోలేదు కానీ ఒళ్ళు చూపించను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మల్లిక జాగుల.
ఇక్కడ క్లిక్ చెయ్యండి