లుక్స్‌తోనే అదరగొడుతున్న వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్
17 October 2023
శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా నటించిన సినిమా సైంధవ్. 2024 సంక్రాంతికి రిలీజ్‌కి రెడీ అవుతోంది సైంధవ్.
''చంటి, కలిసుందాం రా, లక్ష్మి వంటి బంపర్ హిట్ సినిమాల తర్వాత ఇప్పుడు సైంధవ్ సంక్రాంతికి రిలీజ్ కావడం ఆనందంగా ఉంది'' అని అన్నారు వెంకటేష్.
ఈ సినిమా సక్సెస్ అయితే సీక్వెల్ తీయాలనే ఆలోచనలో ఉన్నారు వెంకటేష్. దీని గురించి ఈ విధంగా మాట్లాడారు.
''అందులో ఏం ఉంది? సంక్రాంతికి విడుదలయ్యే సినిమాను జనాలు బాగా ఆదరిస్తే సీక్వెల్ చేస్తాం. సీక్వెల్‌కి సైకో అని పేరు పెడతాం.
శైలేష్ సైకో కోసం ఓ కథ తయారు చేస్తారు'' అంటూ తనదైన శైలిలో చెప్పేశారు వెంకటేష్. సైంధవ్‌లో వెంకటేష్‌ని అందరూ సైకో అంటారు.
చిత్రంలో ఆయన పూర్తి పేరు సైంధవ్ కోనేరు. ఆ పేరును షార్ట్ చేసి అందరూ సైకో అని పిలుస్తుంటారు అని సైకో పేరు పెట్టడం వెనుక ఉన్న సీక్రెట్ రివీల్ చేశారు కెప్టెన్ శైలేష్.
ఇప్పటిదాకా తన కెరీర్‌లో చేసిన సినిమాల్లో సీక్వెల్ చేయాల్సి వస్తే, బొబ్బిలి రాజా సీక్వెల్ చేయడానికి మొగ్గుచూపుతానని ఓపెన్ అయ్యారు వెంకటేష్.
ఆల్రెడీ రానా నాయుడుకి సీక్వెల్ సిద్ధమవుతోందని హింట్ ఇచ్చారు. ఫస్ట్ పార్టులో తెలుగులో అశ్లీల భాష కాస్త మోతాదు తగ్గించే ప్రయత్నం చేశామని చెప్పారు విక్టరీ స్టార్.
సీక్వెల్‌లో ఈ విషయమై జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లినా నాగానాయుడుగా జనాలు గుర్తిస్తుండటం ఆనందంగా ఉందని చెప్పారు.