రష్మికకి మద్దతుగా నిలిచినా ఆ సీనియర్ స్టార్ నటుడు.. 

08 November 2023

సౌత్‌ మీద ఫోకస్‌ చేస్తూనే, నార్త్ లో స్ట్రాంగ్‌గా నిలబడటానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు రష్మిక మందన్న.

ట్రెమండస్‌ హిట్‌ లేకపోయినా ఉత్తరాది జనాల దగ్గర పాస్‌ మార్కులైతే పడ్డాయి. డిసెంబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్న యానిమల్‌ సినిమా మీద ఫోకస్‌ పెంచుతున్నారు రష్మిక.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే రష్మికకి ఇబ్బంది కలిగింది. డీప్‌ ఫేక్‌ వీడియోతో రష్మికను అన్‌పాపులర్‌ చేసే ప్రయత్నాలు చేశారు కొందరు.

దీన్ని స్ట్రాంగ్‌గా ఖండించాలని అంటున్నారు అమితాబ్‌. తక్షణం లీగల్‌గా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది అని ఆయన రష్మికను సపోర్ట్ చేశారు.

ఇవాళ రష్మికకు జరిగింది భవిష్యత్తులో ఇంకెవరికీ జరగకూడదని సపోర్ట్ చేస్తున్నారు నేషనల్‌ క్రష్‌ ఫ్యాన్స్.

అసలు డీప్‌ ఫేక్‌ వీడియో గురించి పంచుకోవడానికి అసౌకర్యంగా ఉందని పోస్ట్ పెట్టారు రష్మిక. టెక్నాలజీని ఇలా మిస్‌ యూజ్‌ చేయడం పట్ల బాధను వ్యక్తం చేశారు.

నటిగా సొసైటీ మీద ఒక అవగాహన ఉన్న ఇలాంటి సమయంలో, ఈ వీడియో రాబట్టి సరిపోయిందని అన్నారు ఆమె.

కాలేజీ సమయంలో ఇలాంటివాటిని ఫేస్‌ చేయాల్సి వస్తే ఎలా ఉండేదోననే ఊహ కూడా తట్టుకోలేకపోతున్నానని అన్నారు రష్మిక. బంధుమిత్రులు పెద్ద సపోర్టింగ్‌ సిస్టమ్‌ అన్నారు.