ఆ క్యారెక్టర్ వల్ల నా జీవితం నాశనం అయ్యింది అంటున్న: రాశి

TV9 Telugu

09 JULY 2024

సీనియర్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

90s లో దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న నటి రాశి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హింది వంటి భాషల్లో 100 పైగా సినిమాల్లో నటించింది.

ఇక రాశి అసలు పేరు రవళి. కానీ వెండితెరకు విజయలక్ష్మీగా ఇంట్రడ్యూస్ అయ్యారు.  ఈమె 10వ తరగతి వరకు చదువుకుని హీరోయిన్‌గా మారిన తర్వాత బీఏ లిటరేచర్ చేశారు.

రాశి మొట్టమొదటిసారిగా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా రావుగారి ఇల్లు, బాల గోపాలుడు, చెట్టుకింద ప్లీడర్‌, ఆదిత్య 369, పల్నాటి పౌరుషం సినిమాల్లో యాక్ట్ చేశారు.

రాశికి మూవీ ఛాన్సులు తగ్గడంతో 2005లో శ్రీముని అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి, పిల్లలతో వైవాహిక జీవితాన్ని గడుపుతున్న రాశి మూవీస్‌కి పుల్‌స్టాప్ పెట్టారు.

అయితే ఇటీవలి కాలంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న రాశి.. తన కెరీర్ ఇలా కావడానికి ఓ సినిమాలో వేసిన క్యారెక్టరే కారణమంటున్నారు రాశి.

ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన నిజం. ఈ మూవీలోని మల్లి క్యారెక్టర్ వల్ల ఎన్నో విమర్శలను  ఎదుర్కుందట.

గోపీచంద్‌తో పరిమితికి మించి రొమాంటిక్ సీన్లలో యాక్ట్‌ చేయడంతో నా మూవీ కెరీర్‌ నాశనం అయ్యి, నా కొంప ముంచిందని చెప్పుకొచ్చింది రాశి.