TV9 Telugu
నేను రెడీగానే ఉన్నాను. కానీ అవకాశాలు ఇవ్వడం లేదు: నటి సుకన్య.
05 April 2024
ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉండి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారిలో సీనియర్ నటి సుకన్య ఒకరు
సుకన్య ఎవరో కాదు తమిళ్ నిర్మాత రమేష్ కూతురు.1991లో పుదునెల్లు పుదు నాథు మూవీతో వెండితెరకు పరిచయమైంది ఆమె..
ఆ తర్వాత పలు సినిమాలు చేసినా, స్లో గా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమై 2002లో పెళ్లి చేసుకుని స్థిరపడింది.
కానీ సంవత్సరంలోపే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత భాషతో పని లేకుండా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించింది.
ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తునట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను ఎప్పుడు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోలేదని..
ఆమె నటించిన సినిమాలకు అవార్డ్స్ కూడా వచ్చాయని., మంచి గుర్తింపు కూడా వచ్చిందని.. కానీ వాటి గురించి ఎవరు మాట్లాడరు.
ఆమె మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీగా ఉన్నాను. కానీ నాకు అవకాశాలు ఇవ్వడం లేదు” అంటూ చెప్పుకొచ్చింది సుకన్య.
సుకన్య చివరిగా తెలుగులో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు మూవీలో హీరో అమ్మ పాత్రలో కనిపించి అలరించింది..
ఇక్కడ క్లిక్ చెయ్యండి