సేవ్ ది టైగర్స్ 2 వచ్చేది అప్పుడే.. నిఖిల్ చేతుల మీదుగా టోర్నమెంట్..

TV9 Telugu

11 March 2024

భార్యల చేతిల్లో నలిగిపోతున్న భర్తల బాధలకు హాస్యాన్ని జోడించే కాన్సెప్టుతో వచ్చింది సేవ్ ది టైగర్స్ సిరీస్.

ఇప్పుడీ సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ సిరీస్ కి సీక్వెల్ కూడా వస్తున్నట్టు తాజాగా ప్రకటించారు ఈ సిరీస్ మేకర్స్.

తాజాగా 'టైగర్స్ ఈజ్ బ్యాక్' అంటూ సేవ్ ది టైగర్స్ రెండో సీజన్ ప్రివ్యూను ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు.

మార్చి 15 నుంచి సెకండ్ సీజన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదిక రాబోతుంది. ప్రదీప్ అద్వైతం, మహి వి రాఘవ్ రచయతలు.

FNCC నిర్వహించు 12వ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ యంగ్ హీరో నిఖిల్ చేతుల మీదుగా ప్రారంభమైంది.

ఈ టోర్నమెంట్ మార్చ్ 10 (ఆదివారం)న ఫిలిం నగర్ వేదికగా మొదలైంది. ఇందులో ఆడటానికి చాల టీమ్స్ తరలి వచ్చాయి.

సౌత్ ఇండియాలోనే ఇది అతిపెద్ద టోర్నమెంట్. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు మొత్తం 69 టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి.

అదే విధంగా చైనాలో జరిగిన టోర్నమెంట్స్‌లో సిల్వర్ మెడల్స్ గెలిచిన పలువురిని FNCC ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించింది.