05 July 2024

సీరియల్లోనే కాదు.. బయటకు కూడా చాలా క్యూట్ ఈ అమ్మాయి..

Rajitha Chanti

Pic credit - Instagram

వేద, యష్.. బుల్లితెరపై యమా క్రేజ్ ఉన్న జోడి. ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయిన జోడీ అన్న సంగతి తెలిసిందే. 

ఇక ఇప్పుడు అదే జోడీ సత్యభామ సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో సత్యగా కనిపిస్తుంది నటి దేబ్జానీ మోదక్. 

వేద పాత్రలో తల్లిగా తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందం, అభినయంతో తక్కువ సమయంలోనే క్రేజ్ సొంతం చేసుకుంది ఈ నటి. 

సీరియల్లో చీరకట్టులో ఎంతో అందంగా కనిపిస్తూ ఫ్యామిలీ అడియన్స్‏ను మాత్రమే కాకుండా యువతను కూడా కట్టిపడేస్తుంది ఈ బెంగాళీ అమ్మాయి.

తాజాగా సోషల్ మీడియాలో దేబ్జానీ లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. సీరియల్లో కనిపిస్తున్నట్లుగానే రియాల్టీలోనూ ఎంతో క్యూట్‏గా కనిపిస్తుంది. 

1996లో మార్చి 20న వెస్ట్ బెంగాల్‏లో కోల్ కత్తాలో జన్మించింది. సెయింట్ జాన్స్ సెకండరీ స్కూల్లో చదుకున్న ఆమె గ్రాడ్యూయేషన్ కంప్లీట్ చేసింది.

అపోన్ జాన్, ఓం నమహ్ శివాయ వంటి బెంగాలీ సీరియల్స్ తోపాటు పలు తమిళం సీరియల్లలోనూ నటించింది. ప్రస్తుతం తెలుగులో చాలా ఫేమస్. 

నాక్ ఔట్ సినిమాతో కథనాయికగా అలరించింది. ఈ సినిమా తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ ఇక్కడే సెటిల్ అయ్యింది దేబ్జానీ మోదక్.