శశి వదనే నుంచి సాంగ్.. భయపెట్టే తమన్నా..
TV9 Telugu
11 April 2024
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన సినిమా శశి వదనే. ఈ చిత్రాన్ని ఈ నెల 19న విడుదల చేయనున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి 'వెతికా నిన్నిలా..' అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. హీరో, హీరోయిన్ల మధ్య ఎడబాటును చెప్పే పాట ఇది.
యాక్షన్ హీరో విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా రత్నం. హరి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది.
ఈ నెల 26న ఈ యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్.
ఈ సందర్భంగా రత్నం చిత్రం నుంచి 'చెబుతావా..' అనే పాటను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ పాట వినసొంపుగా ఉందని అంటున్నారు ఆడియన్స్.
తమన్నా భాటియా, సుందర్.సి., రాశీఖన్నా కీలక పాత్రల్లో నటించిన సినిమా బాక్ అరణ్మణై 4. ఈ నెలాఖరున విడుదల కానుంది.
హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది సినిమా ఇది. అరణ్మణై ఫ్రాంఛైజీకి తమిళనాడులో హిట్ రికార్డ్ ఉంది.
లేటెస్ట్ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు ప్రముఖ కోలీవుడ్ చిత్ర దర్శకుడు సుందర్.సి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి