సర్కారోడు ఇచ్చే ఫన్‌ సూపరండీ.. 

TV9 Telugu

18 April 2024

'జరగండి జరగండి జరగండి.. సర్కారోడు ఇచ్చే ఫన్‌ సూపరండీ.. అంటున్నారు ఆహాలో ప్రసారమయ్యే సర్కార్ షో అభిమానులు.

ఇది కదా మనకు కావాల్సిన మజా' అంటూ సర్కార్‌ సీజన్‌ 4 గేమ్ షో ప్రోమో నెట్టింట్లో తెగ ట్రెండ్‌ అవుతోంది.

ఏప్రిల్‌ 20 అంటే శనివారం నుంచి ఆహాలో ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానున్నట్లు సర్కార్ షో మేకర్స్ ప్రకటించారు.

సుడిగాలి సుధీర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సర్కార్ సీజన్‌ 4 షో మీద ఇప్పటికే మంచి బజ్‌ క్రియేట్‌ అయింది.

ఈ షో ముందు మూడు సీజన్‌లకి ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేసారు. కొన్ని కారణాల వల్ల ఈ సీజన్‌ చేయలేకపోయారు.

ప్రస్తుతం సుదీర్ టాలీవుడ్ లో హీరోగా సినిమాలు చేస్తున్నారు. దీంతో చాన్నాళ్లుగా బుల్లి తెరకు దూరంగా ఉన్నారు.

గతంలో ఆహాలో కామెడీ స్టాక్ ఎక్సచేంజ్ షోకి దీపికా పిల్లితో కలిసి హోస్ట్ చేసారు. మళ్లీ సర్కార్ షోతో ఆహాలో అడుగుపెట్టారు.

సర్కార్ షోతో సుధీర్ తెరిగి రావడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ రాకతో షోలో మరింత ఫన్ పెరిగింది అంటున్నారు.