అందానికి రూపం ఉంటే ఈమెలానే ఉంటుందేమో అనేలా సారా..

17 November 2023

12 ఆగస్టు 1995న మహారాష్ట్ర రాజధాని ముంబైలో సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ దంపతులకు జన్మించింది సారా అలీ ఖాన్.

కొలంబియా యూనివర్శిటీ నుంచి హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందిన తర్వాత, ఖాన్ తన నటనవైపు అడుగులు వేసింది.

ప్రముఖ టైమ్స్ మేగజైన్ లో 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్‌లో తరుచు న్యూస్ లో ఆకట్టుకునేది ఈ వయ్యారి భామ.

2018లో 30వ స్థానంలో, 2019లో 27వ స్థానంలో మరియు 2020లో 24వ స్థానంలో నిలిచింది అందాల తార సారా అలీ ఖాన్.

2018లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా వచ్చిన కేదార్‌నాథ్ చిత్రంతో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.

ఈ సినిమాలో ఈమె నటనకి ఫిల్మ్‌ఫేర్, స్క్రీన్ అవార్డ్స్, IIFA నుంచి బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డ్స్ గెలుచుకుంది.

తర్వాత తెలుగు టెంపర్ కి రీమేక్ గా రోహిత్ శెట్టి తెరకెక్కించిన శింబ చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది ఈ వయ్యారి భామ.

తరువాత రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేమ ఆజ్ కల్ అనే చిత్రంలో కార్తీక్ ఆర్యన్ కి జోడిగా నటించి ఆకట్టుకుంది.