ఆ చంద్రుడైనా గులాం కాడా ఈ వయ్యారి అందాన్ని చూసి..

TV9 Telugu

06 February  2024

8 జూన్ 1996 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు నగరంలో పుట్టి పెరిగింది అందాల తార సప్తమి గౌడ.

ఈమె తండ్రి ఉమేష్ SK దొడ్డి పోలీస్ అధికారి. తల్లి శాంత మాదయ్య గృహిణి. ఈ వయ్యారి సోదరి ఉత్తరే గౌడ ఓ స్విమ్మర్.

బెంగళూరులోని బాల్డ్విన్ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూలింగ్ పూర్తిచేసింది. తర్వాత శ్రీ కుమారన్ చిల్డ్రన్స్ హోమ్ కాంపోజిట్ జూనియర్ కళాశాలలో చదువుకుంది.

బెంగళూరులోని బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి BE సివిల్ ఇంజనీరింగ్ పట్టా పొందింది ఈ వయ్యారి.

ఈ ముద్దుగుమ్మ మంచి స్విమ్మర్ కూడా. చదువుకొనే సమయంలో స్విమ్మింగ్‌ పోటీలో పాల్గొని అనేక పతకాలు సాధించింది.

2020లో ధనంజయతో కలిసి దునియా సూరి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం పాప్‌కార్న్ మంకీ టైగర్‌తో సినీ అరంగేట్రం చేసింది.

తర్వాత 2022లో బ్లాక్‌బస్టర్ చిత్రం కాంతారాలో లీలా పాత్రలో కనిపించింది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

2023లో ది వాక్సిన్ వార్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం యువ అనే కన్నడ యాక్షన్ డ్రామా చిత్రంలో నటిస్తుంది.