చిరు నవ్వు ఈ వయ్యారి కోసమే పుట్టింది.. క్యూటీ సప్తమి.. 

10 September 2024

Battula Prudvi 

జూన్ 8, 1996న కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించింది సప్తమి గౌడ. ఆమె తండ్రి S. K. ఉమేష్ గౌడ్ రిటైర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్. తల్లి పేరు శాంత గౌడ.

ఓ ప్రముఖ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్‎లో సివిల్ ఇంజనీరింగ్‎ డిగ్రీ పట్టా పొందింది ఈ బ్యూటీ.

చదువుకొనే రోజుల్లో  స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించింది. కన్నడ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‎గా ఉంది.

కన్నడ డివైన్ బ్లాక్ బస్టర్ చిత్రం కాంతార సినిమాలో రిషబ్ శెట్టి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. అలాగే ఈ సినిమాలో తన అందంతోనూ కవ్వించింది ఈ ముద్దుగుమ్మ.

కాంతార సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది.

ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ పెరిగాయి. తర్వాత యువ అనే సినిమాలో కనిపించింది.

కర్ణాటకలోని వయసులో ఉన్న అమ్మాయిలకు మెన్‌స్ట్రువల్ కప్పుల పంపిణీని కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన "నాన్న మైత్రి" పథకానికి అంబాసిడర్‌గా ఉంది.