TV9 Telugu
యానిమల్ పార్క్ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే.!
30 March 2024
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన యానిమల్ సినిమా పెద్ద సన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు అడియన్స్ నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ తో పాటు విమర్శలు కూడా వచ్చాయి.
ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఇందులో బాబీ దేవోల్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు.
చాల గ్యాప్ తరువాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందించిన యానిమల్ కు 900 కోట్లకు పైనే కలెక్షన్స్ వచ్చాయి.
ఇందులో బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.
ఇక ఈ సినిమాకు యానిమల్ పార్క్ అనే పేరుతో సీక్వెల్ చేయనున్నట్టు ప్రకటించారు డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా.
ఈ సినిమా సీక్వెల్ అయిన యానిమల్ పార్క్ షూటింగ్ 2026లో మొదలవుతుందన్నది బాలీవుడ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
అంతలోపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ ని కంప్లీట్ చేయాలన్నది సందీప్ రెడ్డి మాస్టర్ ప్లాన్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి