యానిమల్ పార్క్ అప్పుడే మొదలు..
TV9 Telugu
24 April 2024
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన హిందీ యాక్షన్ డ్రామా చిత్రం యానిమల్.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించగా T-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంస్థలు నిర్మించాయి.
భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగ ఈ చిత్రానికి నిర్మాతలగా వ్యహరించారు.
అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ తదితరులు ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.
పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందనున్న సినిమా యానిమల్ పార్క్.
యానిమల్ సినిమా సీక్వెల్‌ని 2026లో మొదలుపెడతామని అన్నారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్న సందీప్‌రెడ్డి వంగా.
తొలి భాగంతో పోలిస్తే మరింత హింసాత్మకంగా ప్రేక్షకుల ఊహకు కూడా అందని యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అన్నారు సందీప్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి