నాన్న మీద కోపంతో పేరు మార్చుకున్న సంయుక్త మీనన్ ..
Rajeev
11 AUG 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్. ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రాలన్ని బ్లాక్ బస్టర్ అయ్యింది.
తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీకి మాత్రం మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.
చివరిసారిగా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.
సంయుక్త మీనన్ ప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా సంయుక్తమీనన్ తన పేరును మార్చుకుంది. తన పేరులోని మీనన్ ను తొలగింది.
తన తండ్రి మీద కోపంతో తన పేరును తొలగించా అని చెప్పింది. మా అమ్మ నాన్న విడిపోయారు. మా అమ్మ అంటే నాకు ఇష్టం. ఫీలింగ్స్ అన్నింటిని గౌరవించి నా పేరులో మీనన్ తీసేసా అని తెలిపింది.