శిల్పం వంటి రూపు ఈమెదేమో.. సంయుక్తకి డిఫరెంట్ పోస్టర్ తో విషెస్..

12 September 2023

భీమ్లా నాయక్ చిత్రంలో రానా భార్య పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్.

తర్వాత వశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సరసన కథానాయకిగా బింబిసారలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ భామ.

దీని తర్వాత ధనుష్ కి జోడిగా సార్ చిత్రంలో ఆకట్టుకుంది. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

తర్వాత సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష మూవీలో నందిని పాత్రలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టింది. ఈ చిత్రంతో మరో విజయాన్ని అందుకుంది.

హ్యాట్రిక్ విజయాలతో ఈ అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈమె.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్, నిఖిల్ స్వయంభూ చిత్రాల్లో నటిస్తున్నారు. సోమవారం సంయుక్త పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్స్ విడుదల చేశారు మేకర్స్.

అయితే స్వయంభూ మాత్రం కాస్త డిఫరెంట్ స్టైల్ లో చేతిలో చిలుకను పట్టుకొని ఉన్న ఓ అందమైన శిల్పం ఉన్న పోస్టర్ ద్వారా సంయుక్తకు విష్ చేశారు.

డెవిల్ టీం విడుదల చేసిన పోస్టర్ లో సంప్రదాయం ఉట్టిపడే చీరకట్టులో గుడిలో నడుస్తూ కనిపించింది. ఈ పోస్టర్ ద్వారా చిత్రంలో ఆమె పాత్ర పేరు కూడా తెలియజేసారు.