08 October 2025

ఎట్టకేలకు ఛాన్స్ కొట్టేసింది.. ఆ స్టార్ హీరో సరసన సమంత.. ? 

Rajitha Chanti

Pic credit - Instagram

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా చక్రం తిప్పిన సమంత.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 

ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో యాక్టివ్ అవుతుంది. ఇటీవలే శుభం సినిమాతో నిర్మాతగా సక్సెస్ అయ్యింది. కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట. 

తాజాగా సామ్ మరో ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఓ సినిమా చేయనున్నారట. 

వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రానికి ఆరసన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారట.

ఇందులో శింబు సరసన కథానాయికగా సమంతను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమంతతో చర్చలు ప్రారంభించారని టాక్. 

ఒకవేళ్ల అన్నీ కుదిరి సినిమా కార్యరూపం దాల్చితే.. శింబు, సమంత కలిసి చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది. దీనిపై ప్రకటన రావాల్సి ఉంది. 

గతంలో మాదిరిగా ఎక్కువ సినిమాలు చేయడం లేదు సమంత. తన ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న సామ్.. ఇప్పుడిప్పుడే యాక్టివ్ అయ్యింది. 

మరోవైపు సోషల్ మీడియాలో బ్రాండ్ ప్రమోషన్స్, లేటేస్ట్ గ్లామర్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. మా ఇంటి బంగారం చిత్రంలో నటిస్తుంది.