లేడీ ఓరియేంటెడ్ సినిమాతో సమంత రీఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇన్నాళ్లు కథానాయికగా అలరించిన సమంత.. ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది. సామ్ నిర్మించిన శుభం సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే.
చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. శుభం సినిమాలో మాత్రం అతిథి పాత్రలో మెరిసింది. ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చంది సామ్.
అయితే ఇప్పుడు సామ్ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇంతకీ సామ్ నటించనున్న ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.. ?
ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. సమంత కోసం గురూజీ అదిరిపోయే లేడీ ఓరియేంటెడ్ స్క్రీప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం.
నిజానికి త్రివిక్రమ్ ఇప్పుడు అల్లు అర్జున్ తో ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం బన్నీ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించబోయే సినిమాతో బిజీగా ఉన్నారు.
ఆ తర్వాత త్రివిక్రమ్, బన్నీ కాంబోలో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ క్రమంలో ఇప్పుడు గురూజీ సమంత కోసం ఓ లేడీ ఓరియేంటెడ్ స్రిప్ట్ సిద్ధం చేశారట.
ఇప్పటివరకు గురూజీ లేడీ ఓరియేంటెడ్ స్క్రిప్ట్ ఎన్నడు తెరెకక్కించలేదు. కానీ ఇప్పుడు సామ్ కోసం మంచి పవర్ ఫుల్ లేడీ ఓరియేంటెడ్ సినిమా రెడీ చేస్తున్నాడట.
ఇదివరకే త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. మూడు సూపర్ హిట్స్.