సమంతకు స్పూర్తి ఆయనే.. ఎప్పటికీ అతడే తన సూపర్ హీరో.. ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న సమంత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన విశ్రాంతి తీసుకుంటుంది.
శాకుంతలం సినిమా తర్వాత చివరిసారిగా డైరెక్టర్ శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ఖుషి చిత్రంలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత మయోసైటిస్ సమస్యకు చికిత్స కోసం అమెరికా వెళ్లింది. ఆ తర్వాత భూటాన్ లో ఇమ్యూనిటీ బూస్టింట్ ట్రీట్మెంట్ తీసుకుని కొన్ని నెలల క్రితం ఇండియాకు తిరిగి వచ్చింది.
ఇదిలా ఉంటే.. ఇటీవలే ఓ కాలేజీ ఫంక్షన్లో పాల్గొంది సామ్. ఈ సందర్భంగా అక్కడుకున్న కొందరు స్టూడెంట్స్ తో సమంత ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానలు ఇచ్చింది.
నటనలో మీకు స్పూర్తి ఎవరు ? అంటూ సమంతను ప్రశ్నించారు అక్కడున్న స్టూడెంట్స్. సమంత మాట్లాడుతూ నటనలో తనకు అల్లు అర్జున్ స్పూర్తి అని చెప్పుకొచ్చింది.
అల్లు అర్జున్ తో కలిసి మరోసారి నటించాలనుకుంటున్నాని.. ఎందుకంటే ఇప్పుడు నటనలో ఆయన చాలా మారిపోయాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సామ్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
గతంలో ఓ సందర్భంలో సమంత మాట్లాడుతూ.. అల్లు అర్జున్ తన సూపర్ హీరో అని చెప్పుకొచ్చింది. వీరిద్దరు కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నటించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైరెక్టర్.
అలాగే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే పుష్ప 2లోనూ సామ్ మళ్లీ సాంగ్ చేయనుందని టాక్ నడుస్తుంది. కానీ దీనిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.