14 February 2025
ఆ విషయం గుర్తించండి.. లేదంటే భాగస్వామిని కోల్పోవాల్సి ఉంటుంది.. సమంత.
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ హీరోయిన్ సమంత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చివరగా ఖుషి చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్న సామ్.. గతేడాది సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలో సందడి చేసింది.
చాలా కాలం తర్వాత తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది సామ్. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా.. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది సామ్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయొద్దంటూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇప్పుడు సామ్ కామెంట్స్ వైరలవుతున్నాయి.
ఒక వ్యక్తితో మంచి అనుబంధాన్ని కలిగి ఉండవచ్చు. కానీ మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా లేనప్పుడు.. మీ భాగస్వామికి నచ్చినట్లుగా కనిపించలేరు.
ఒక వ్యక్తి పైకి అందంగా కనిపించినా.. మానసికంగా ప్రశాంతంగా ఉండరు. ఆ విషయాన్ని గుర్తించలేకపోతే ఏదో సమయంలో మనం ఆ భాగస్వామిని కోల్పోవాల్సి ఉంటుంది.
ఆరోగ్యం, మానసిక, శారీరక ఆరోగ్యం, భాగస్వామి గురించి చెప్పుకొచ్చింది సామ్. ప్రస్తుతం సామ్ ఇన్ స్టాలో చాలా యాక్టివ్ ఉంటున్న సంగతి తెలిసిందే.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్