16 December 2023

ఇక హీరోయిన్‌గా కాదు.. ప్రొడ్యూసర్‌గా కూడా.!

తొండ ముదిరి ఊసరవెళ్లి అయినట్టు.! కొందరి హీరోయిన్స్ అలానే చేస్తున్నారు.

బాగా డబ్బూ,హోదా సంపాదించుకున్న ప్రొడ్యూసర్లుగా కూడా మారే ప్రయత్నం చేస్తుంటారు.

సేమ్ టూ సేమ్‌ సమంత కూడా ఇప్పుడు ఇదే చేయాలని చూస్తున్నారు.

తాజాగా తన ప్రొడక్షన్ హౌస్‌ నేమ్‌ను థీమ్‌ను రివీల్ చేసి ఓవర్‌ నైట్‌ నెట్టింట వైరల్ అవుతున్నారు.

ఎట్ ప్రెజెంట్ సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి  ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత..

తాజాగా ఓ అనౌన్స్ మెంట్ చేశారు. తను ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పారు.

ఆ ప్రొడక్షన్ హౌస్‌ పేరు 'ట్రాలాలా..' అంటూ రివీల్ చేశారు.

తన సోషల్ మీడియా హ్యాండిల్లో లోగోను పోస్ట్ చేశారు.

సినిమాలు తెరకెక్కించే సత్తా ఉన్న కొత్త దర్శకులకు తన ప్రొడక్షన్ హౌస్‌లో  ఛాన్స్‌ లిస్తా అన్నారు సమంత.