సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గత 15 యేళ్ల కెరీర్‌లో ఎన్నో విభిన్న చిత్రాలతో అలరించింది.
ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సమంత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారి ప్రేక్షకులను మెప్పించింది.
ఆ తరువాత తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ తన నటన తో అందరిని ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
దాదాపు అందరి స్టార్ హీరోస్ సరసన నటించింది. ఇదే సమయంలో నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది సమంత.
ఆ తరువాత కొన్ని మనస్పర్థలు కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకోగా.. తాజాగా నాగ చైతన్య శోభితాను ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
అయితే.. నాగ చైతన్యతో విడాకుల.. మళ్లీ శోభితా ధూళిపాళ్లతో రెండో మ్యారేజ్ కు సిద్దమవుతోన్న ఈ సమయంలో సామ్ రెండో పెళ్లిపై స్పందించింది.
నేను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న.. ఇప్పుడు విడాకులు తీసుకున్న ఇక నా జీవితం లో మరొక పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదంటూ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇప్పుడు ప్రస్తుతం ఒక వైపు సినిమాలు చేస్తూ మరొక వైపు వెబ్ సిరీస్‌లలో యాక్ట్ మళ్లీ ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది సమంత. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తుంది.