సినిమాలకు అందుకే దూరంగా ఉన్నాను.. ఎప్పటికీ అలా అనుకోవద్దు.. సమంత..
Rajitha Chanti
Pic credit - Instagram
మయోసైటిస్ సమస్యతో ఏడాదిన్నరగా పోరాడుతున్నానని.. ఇప్పటికీ ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నానని అన్నారు సమంత. మానసిక ధైర్యంతో కోలుకుంటున్నట్లు తెలిపారు.
తాజాగా తన హెల్త్ పాడ్ కాస్ట్ సిరీస్ లో ఆమె మై జర్నీ విత్ ఆటో ఇమ్యూనిటీ గురించి చెప్పుకొచ్చారు. అందులో న్యూట్రీషనిస్ట్ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలు ఇచ్చారు.
దాదాపు పదమూడేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని.. ఒకే సంవత్సరంలో దాదాపు 5 సినిమాలు విడుదలయ్యాయని.. అంతగా బిజీగా ఉండే తాను బ్రేక్ తీసుకున్నానని అన్నారు.
సినిమాలకు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకోవడం తేలికైనా విషయం కాదని.. తన జీవితంలో ఇప్పటివరకు తీసుకున్న కఠిన.. ఉత్తమమైన నిర్ణయం ఇదే అని అన్నారు సామ్.
ఆరోగ్య పరిస్థితుల కారణంగా వర్క్ కంటిన్యూగా చేయడం వీలుకాలేదని.. పని పరంగా ఒత్తిడి, ఇతర విషయాలను తట్టుకోవడం అంత సులబం కాదని చెప్పుకొచ్చింది సమంత.
వచ్చిన సమస్య మ్యాజిక్ చేసినట్లు తగ్గిపోతుందని అనుకోవద్దని.. ఎప్పటికీ తాను ఎన్నో విషయాల్లో బాధపడుతున్నానని.. కానీ ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొవడం తెలుసని..
కాబట్టే ఇంత ధైర్యంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. మానసిక ధృఢంగా ఉంటే దేనినైనా జయించవచ్చని అర్థం చేసుకున్నానని.. ప్రతిఒక్కరి జీవితంలో చీకటి రోజులు ఉంటాయని తెలిపింది.
ఓర్పుతో ముందుకు వెళ్తే జీవితం అందంగా ఉంటుందని.. తనకు వచ్చిన వ్యాధి తగ్గడానికి సమయం పడుతుందని తెలుసనని.. కోలుకోవడానికి ఏం చేయాలో శ్రద్ధగా చేస్తున్నాని తెలిపింది.