10 November 2023

అందుకే నా అరోగ్యం గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తాను.. సమంత.. 

Pic credit - Instagram

చాలా రోజులుగా మయోసైటిస్ సమస్యతో పోరాడుతుంది సమంత.  ప్రస్తుతం ఆమె భూటాన్‏లో ఇమ్యూనిటి పెంచుకునేందుకు చికిత్స తీసుకుంటుంది సామ్.

తాజాగా హెర్పజ్ బజార్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్.. తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య పరిస్థితి, సోషల్ మీడియాలో తన యాక్టివిటిపై అనేక విషయాలు చెప్పుకొచ్చింది. 

సోషల్ మీడియాలో తన ఆరోగ్య పరిస్థితి గురించి.. వ్యక్తిగత విషయాలను చెప్పుకొవడం గురించి ప్రశ్నించగా.. ఆసక్తికర కామెంట్స్ చేసింది హీరోయిన్ సమంత. 

సోషల్ మీడియాలో తన విషయాలు పంచుకోవడం అంత సులభం కాదని.. కానీ తనకు నెట్టింట ఉండడం మధరుమైన ప్రదేశాల్లో ఉన్నట్లు అనిపిస్తుందని తెలిపింది. 

అలాగే తాను ఇప్పటికే ట్రోలింగ్‎కు అలవాటు పడ్డానని.. ఎన్నో సార్లు తనను ట్రోల్ చేశారని.. తన సినిమాల విషయంలోనూ తనపై ట్రోల్స్ వచ్చాయని తెలిపింది. 

కానీ తన ఫాలోవర్స్ ఎక్కువ మంది మాత్రం నిజమైన సమంతను చూస్తున్నారని.. అది తనకు చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది హీరోయిన్ సామ్. 

తన బలం, బలహీనతలు, జీవితం గురించి సోషల్ మీడియాలో చూపించడం తనకు చాలా సంతృప్తినిస్తుందని.. ఏదైనా తప్పుగా పోస్ట్ చేస్తే ట్రోల్ అవుతుందని అన్నారు. 

ఏదైనా తప్పుగా పోస్ట్ చేసిన వెంటనే ట్రోల్ చేస్తారని దీంతో తన మనసు మార్చుకుంటున్నాని.. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ఒక మధురమైన ప్రదేశమని అన్నారు.